మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నితిన్ కాబ్ర .ఎండి .డియం.ఆధ్వర్యంలో షీ టీమ్ అవగాహన సదస్సు
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ నితిన్ కాబ్ర .ఎండి. డియం.ఆధ్వర్యంలో బుధవారం షీ టీమ్ బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీం సభ్యులు మాట్లాడుతూ
ర్యాగింగ్ భారతదేశంలో ఒక నేరం, కాబట్టి సుప్రీం కోర్టు ఖచ్చితంగా నిషేధించిందన్నారు ప్రతి ఒక్కరు
నేరాలు,ఘోరాలు ,ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు.ఇలాంటివి జరిగినప్పుడు ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా..విద్యార్థినులు, మహిళలు అభద్రత బావనికి గురైనప్పుడు భయపడొద్దని,ధైర్యంగా ముందుకు వచ్చి షీ టీం కి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో మహిళల, విద్యార్థినిల రక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రధానంగా మహిళలు, విద్యార్థినిలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత సమాచారాన్ని వారితో పంచుకోవద్దని,ముఖ్యంగా సామాజిక మాద్యమాల్లో పరిచమయమ్యే వ్యక్తులతో మరింత అప్రమత్తం వుండాలని సూచించారు.మహిళలు తాము పనిచేసే ప్రదేశాల్లోగాని,మరేక్కడైన లైంగిక వేధింపులకు గురౌవుతున్న, ర్యాగింగ్ హిళలు,విధ్యార్థునులు,బాలికలు మౌనంగా ఉండకుండా, ధైర్యంగా పిర్యాదు చేయాలని సూచించారు.
విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ లేదా24×7 హెల్ప్‌లైన్: మీరు ర్యాగింగ్‌కు బాధితులైనా లేదా దానికి సాక్ష్యమైనా, టోల్-ఫ్రీ జాతీయ యాంటీ-ర్యాగింగ్ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-5522కు కాల్ చేయండి.ఇమెయిల్ మద్దతు: ఫిర్యాదులను helpline@antiragging.inకు కూడా పంపవచ్చు అన్నారు .
ఎప్పుడూ వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని పంచుకోకూడదు అని ఛాటింగ్ ఫోటోలు చిత్రాలను సోషల్ మీడియా లో పంచుకోకుడదని, తెలియని వ్యక్తుల నుండి స్నేహితుల అభ్యర్థనలను అంగీకరించవద్దు అన్నారు…ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ కాబ్ర.ఎండి.డియం. మరియు షి టీం సభ్యులు ఎన్ .వెంకటయ్య, ఏ ఎస్ ఐ, శంకర్,విజయ్,ప్రమీల,విజయ రాణి విద్యార్థులు ,సిబ్బంది పాల్గొన్నారు.